AP: మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని తనపై చేసిన వ్యాఖ్యలకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. విడదల రజిని చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరుకు పారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకి వచ్చారని.. చిలకలూరిపేటలో తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి గుంటూరు పారిపోయిన విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు.