MLC తోట త్రిమూర్తులు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, సామినేని ఉదయభాను వరసకు వియ్యంకులు.. తోట కూడా తనతో పాటు వస్తారని జనసేన పెద్దలకు సామినేని చెప్పినట్లు సమాచారం. అయితే తోట చేరికకు జనసేన నుంచి ఇంకా క్లారిటీ రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు పార్టీలకు అనుకూలంగా ఉన్న నేతలను మాత్రమే చేర్చుకుంటున్నారని సమాచారం.