అండమాన్, నికోబార్ దీవుల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.