AP: నైరుతి రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు(జూలై 6న) ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. SKLM, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ. గో, ప. గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.