AP: రాష్ట్ర విభజన హామీలపై ఏపీ ప్రజలను మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల మండిపడ్డారు. ఏపీ ప్రజలను మోదీ ఇప్పటికే వెన్నుపోటు పొడిచారని.. హోదా ఇస్తామని మోసం చేశారని అన్నారు. మొన్న మోదీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాటకూడా మాట్లాడలేదన్నారు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదని.. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదని విమర్శించారు.