అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న ఇరువురు నేతలు భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. భేటీ సందర్భంగా మోదీకి విందు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, వీటిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనపై మూడు రోజుల క్రితం స్పందించిన భారత విదేశాంగశాఖ.. రెండు దేశాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయని చెప్పింది.