కూటమి ప్రభుత్వం తాజాగా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు మరో శుభవార్తను వినిపించింది. రాష్ట్రంలోని హార్టీకల్చర్ రైతులకు రాయితీ కింద దాదాపు రూ.6 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూలైలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు డీబీటీ ఇన్ పుట్ రాయితీని 8376 మంది రైతులకు అందించనున్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారు కింద పత్తికి రూ.25వేలు, అరటికి రూ.35వేలు ఇవ్వనున్నారు.