ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోపే.. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. మద్దతు ధర రూ.2,350తో మొదటి రకం వడ్లను కొంటామని చెప్పారు. రైతులు వారికి నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గోనెసంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు.