మద్యం తాగొద్దన్నందుకు తల్లి, చెల్లిపై కత్తితో దాడి

85చూసినవారు
మద్యం తాగొద్దన్నందుకు తల్లి, చెల్లిపై కత్తితో దాడి
మద్యం తాగొద్దని చెప్పిన తల్లి, చెల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చయ్యపాలెంకు చెందిన ములపర్తి రాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేయమని తల్లి మందలించడంతో.. కోపోద్రిక్తుడడైన రాజు తల్లిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన చెల్లిని కూడా పొడిచాడు. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్