AP: విజయవాడలోని గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభమ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవాడ కేథలిక్ పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు ఆదివారం ప్రారంభించారు. 1923లో ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదల కొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1925 FEBలో తొలిసారి ఉత్సవాలు ప్రారంభించగా, ఈ సారి 101వ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికి పైగా భక్తులు రానున్నారు.