AP: 'తల్లి వందనం పథకం' కింద కూటమి సర్కార్ తల్లుల ఖాతాల్లో ఇప్పటికే రూ.13 వేలు చొప్పున జమ చేసింది. అయితే ఈ డబ్బుల్ని కొందరికి మాత్రం జులై నెలలో జమ చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి (2025-26) సంబంధించి ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం డబ్బులు జమ చేయలేదు. వీరందరికి జులై 5న ఖాతాల్లో జమ చేయనుంది. ఎందుకంటే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది.