AP: ప్రకాశం జిల్లాలోని తెలుగు వీధిలో కొడుకును చంపిన తల్లి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు శ్యామ్ ప్రసాద్‌ను ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవి హత్య చేయించినట్లు నిర్ధారించారు. శ్యామ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనే సంచుల్లో కుక్కి మేదర వీధి సమీపంలో పడేశారు. మద్యానికి బానిసై సైకోగా ప్రవర్తిస్తున్న శ్యామ్‌ను తల్లి హత్య చేయించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, శనివారం శ్యామ్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.