విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో పురోగతి కనిపించింది. గత నాలుగు రోజులుగా బోట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇవాళ ఆరు అడుగుల మేర ఒక బోటును ప్రత్యేక బృందం కదిలించింది. ఐరన్ తాడు సాయంతో బోటును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. దుర్గాఘాట్ వైపు బోటును లాగుతున్నారు.