రుతుపవనాల్లో కదలికలు.. భారీ వర్షాలు

60చూసినవారు
రుతుపవనాల్లో కదలికలు.. భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా ఈ నెల 12 నుంచి రుతుపవనాల్లో కదలికలు వచ్చి దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి రాయలసీమలో, బుధవారం నుంచి కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్