తెలంగాణ స్థానిక ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మొదట MPTC, ZPTC ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారా మోగనున్నది. MPTC, ZPTC ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను EC ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 కల్లా పోలింగ్‌కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.