మునగపూల ‘టీ’తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పూలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి1, బి2, బి3, సి వంటి ఖనిజాలు అందుతాయి. రోజుకు రెండుసార్లు ఈ టీని తాగితే.. కంటికి సంబంధించిన రోగాలు నయం అవుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, తలనొప్పి వంటి సమస్యలకు ఈ టీ ఉపశమనాన్నిస్తుంది. ఇది కాలేయంలోని ఎంజైములను నియంత్రిస్తూ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.