AP: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రకటించింది. జీతాలు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని పేర్కొంది. తమ డిమాండ్లు తీర్చాలని యూనియన్ ఆధ్వర్యంలో 38 రోజులుగా సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపినా ఫలించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది.