తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నటి ఖుష్బూ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆయన వల్ల తన కుటుంబం ఎన్నో సమస్యలు చూసిందన్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయనకు ఎదురుతిరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. అది తట్టుకోలేక ఆయన షూట్‌కు వచ్చి అందరి ముందు కొట్టేవాడని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు.