గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై నటుడు అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాద వార్త విని నా హృదయం ముక్కలైంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. కాగా, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది చనిపోయారని తెలుస్తోంది.