AP: గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఆయన భార్య పంకజశ్రీ శనివారం కలిశారు. వంశీని తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని, నేరం రుజువు కాకుండా బంధించారని ఆమె ఆరోపించారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని, జైలులో టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.