మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన మూవీ కన్నప్ప ప్రమోషన్స్‌లో భాగంగా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 'మా నాన్న సంతోషంగా ఉండాలనేది మాత్రమే నా ఆలోచన. ఆయన పేరు చెడగొట్టకూడదు. ఆయనకు ఏరోజు అయితే చెడ్డపేరు తీసుకువస్తానో ఆరోజు ఒక కొడుకుగా బతికినా ఒకటే చచ్చినా ఒకటే' అని అన్నారు.