ప్రఖ్యాత సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు నరకం లేదా పాకిస్థాన్ అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటే, తాను నరకాన్ని ఎంచుకుంటానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ‘ఒక వర్గం నన్ను నరకానికి పోతావని అంటోంది. మరో వర్గం నన్ను 'జిహాదీ' అనీ, పాకిస్థాన్ వెళ్లిపోవాలనీ అంటుంది. ఈ రెండే నాకు మిగిలిన దారులైతే, నేను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతాను’ అని స్పష్టం చేశారు.