రాజమండ్రిలో నాగచైతన్య కటౌట్‌కు అభిమానులు బీరుతో అభిషేకం చేశారు. 'తండేల్' సినిమా విడుదల సందర్భంగా అప్సర థియేటర్ ముందు ఏర్పాటు చేసిన కటౌట్‌కు బీరులతో అభిషేకం చేసి సందడి చేశారు. అయితే శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించారు.