ఇటీవల బాలకృష్ణకు నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీలో సీఎం చంద్రబాబు కొత్త విషయాన్ని చెప్పారు. బాలయ్య హిందూపురం టికెట్‌ని తన భార్య వసుంధరకు ఇవ్వమని అడుగుతూ ఉంటారని చంద్రబాబు చెప్పారు. బాలయ్య తన సతీమణిని హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే హిందూపురంలో బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ వసుంధర అన్ని పనులు చూస్తూంటారు.