మద్యపానం సేవించడం వల్ల కలిగే అనర్థాలను ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ప్రజలకు వివరించారు. ఆళ్లగడ్డలోని ఆర్కే ఇండస్ట్రీస్ ఆవరణలో శనివారం ఆయన మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎక్సైజ్ సూపరిండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కేర్ ప్రోగ్రాంలో భాగంగా అన్నిచోట్ల సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మద్యపానం వల్ల కలిగే అనర్థాలను వివరించినట్లు తెలిపారు.