అహోబిలేసుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
అహోబిలేసుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లను బుధవారం మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆయన ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల వేద ఆశీర్వచనాలు అందించడంతోపాటు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈయన వెంట పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్