ఆళ్లగడ్డలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన...

66చూసినవారు
ఆళ్లగడ్డలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన...
ఆళ్లగడ్డ పట్టణంలోని జె. కె ఆయుర్వేదిక్ స్టోర్స్ ప్రాంగణంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని పెద్ద సంఖ్యలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సీతా కళ్యాణి ఆధ్వర్యంలో ధన్వంతరి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you