ఆలూరు: దేవనకొండ వైన్ షాపులో చోరీ

67చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల కేంద్రంలోని వైన్ షాపులో గురువారం తెల్లవారుజాము చోరీ జరిగిందని షాపు యజమానులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు షాపులోని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ను పరిశీలించగా, ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి, దొంగతనం చేసినట్లు రికార్డు అయ్యిందన్నారు. వారు ముఖాలకు మాస్కులు ఉన్నందున గుర్తించడానికి వీలు కాలేదు. దుకాణంలోని రూ. 9, 500 నగదు అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్