నందివర్గంలో వేధింపుల కేసు నమోదు

79చూసినవారు
నందివర్గంలో వేధింపుల కేసు నమోదు
బనగానపల్లె మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కైపకు చెందిన చెన్నయ్యపై ఆదివారం వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఇతను ఎనమిదేళ్ల క్రితం స్వర్ణలత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నయ్య భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడని ఈమేరకు బాధితురాలు స్వర్ణలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్