అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం వైఎస్సార్సీసీ కార్యకర్త కృష్ణకాంత్ పై అధికార టీడీపీ పార్టీ కార్యకర్తలు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణకాంత్ కుడి కాలికి బలమైన గాయం అయింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో బనగానపల్లె ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఇరువర్గలపై కేసు నమోదు చేశామని ఎస్సై కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.