బనగానపల్లె నందవరం చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శనివారం రోజు పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి మూల మూర్తికి విశేష పూజ నిర్వహించి అనంతరం యాగశాల నందు చండీహొమం నిర్వహించినారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తి కి విశేష అలoకరణ చేసి పల్లకీ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.