బనగానపల్లె మండలంలోని రైతులకు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికి సబ్సిడీపై జీలుగ విత్తనాలు సోమవారం నుంచి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి 110 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయన్నారు. 50 శాతం సబ్సిడీపై కిలో రూ. 44 ప్రకారం ప్రతి రైతు అవసరం మేరకు 50-60 కిలోలు పంపిణీ చేస్తామని చెప్పారు.