బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండపై ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో 7, 8, 9వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈనెల 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామలక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 7వ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశపరీక్షలో ఎంపికైన విద్యార్థులకు సీబీఎస్ఈ విధానంలో విధ్యాబోధన ఉంటుందని చెప్పారు.