కోవెలకుంట్ల పట్టణంలో ఆటో అదుపుతప్పి ఆటో బోల్తాపడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. మంగళవారం కోవెలకుంట్లకు చెందిన చుక్కా సుబ్బరాయుడు, చుక్కా రాజు, కంపమల్ల జయన్న, మరొక వ్యక్తితో కలిసి ఆటోలో అమడాలకు వెళ్ళి అక్కడ పని ముగించుకుని తిరిగి కోవెలకుంట్లకు బయల్దేరారు. కాగా మార్గ మధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో సుబ్బరాయుడు (52) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.