కోవెలకుంట్ల- బనగానపల్లె ఆర్అండ్ బీ రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. బనగానపల్లె నుంచి కోవెలకుంట్లకు ప్రయాణికులతో వస్తున్న ఆటో అమడాల మెట్ట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. జమ్మలమడుగుకు చెందిన ఉసేన్ పీరా అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రునికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.