బనగానపల్లెలోని ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నివాసంలో శుక్రవారం 20 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అవుకు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన వారు టీడీపీని వీడి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. బనగానపల్లె మరింత అభివృద్ధి చెందాలంటే తనకు ఓటు వేసి మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.