నేడు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం

51చూసినవారు
నేడు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం
బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా నందవరం గ్రామంలో రెండో రోజు బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీదేవి, దేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి జి. కామేశ్వరమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్