డోన్ పట్టణంలోని వైద్య పాలీక్లినిక్ కేంద్రంలోఈనెల13న కర్నూలుకు చెందిన రియా ఫెర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ డాక్టర్ శ్రావ్య ఆధ్వర్యంలో శనివారం గర్భిణులకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయనున్నట్లు మంగళవారం ఆసుపత్రి వర్గాలు ఒకప్రకటనలో తెలిపారు. అలాగే సంతానం కలగనివారికి పరీక్షలు నిర్వహించి వైద్యసలహాలతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారన్నారు. ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.