సి. బెళగల్ మండలంలోని కంబదహాల్ శివారులో ఉన్న బీరప్ప స్వామి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పురోహితులు నరసింహింహరావు పండిత బృందం సభ్యులు గణపతి పూజ నిర్వహించారు. పుణ్యాహవాచనం, మాతృకాపూజ, రక్షాబంధనం, మహాయాగ మంటప ప్రవేశం, షోడశస్తంభపూజలు, కళశ స్థాపన తదిత పూజలు చేశారు. సాయంత్రం అంకురారోపణం, అగ్నిప్రతిష్ట, దీక్షాహోమం నిర్వహించారు.