జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు హాజరయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ లకు శాలువా కప్పి,సన్మానించి జనసేన పార్టీ తరఫున గెలుపొందిన 21 మంది శాసనసభ్యులకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.