కోసిగి మండలంలోని గౌడగల్లు గ్రామ శివార్లలో గల కొండ ప్రాంతంలో మేత మేస్తున్న మేకల మందపై బుధవారం అందరూ చూస్తుండగానే పట్టపగలే ఒక్కసారిగా చిరుతపులి మెరుపు దాడి చేసింది. మందలోని మేకను చంపే ప్రయత్నం చేస్తుండగా అప్రమత్తమైన మేకల కాపరులు వెంటనే కుక్కలు సహాయంతో అరుపులు కేకలు వేయడంతో మేకను ప్రాణాలతో వదిలి పక్కనే ఉన్న కొండలోకి పరుగులు పెట్టింది. కొండలో చిరుతపులి ఉండడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.