ఆస్పరి మండలంలోని జొహరాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన వడ్డె రూప 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో బేస్ బాల్ గేమ్ అండర్ 14 కేటగిరి లో ప్రతిభ చాటింది. శనివారం ప్రధానోపాధ్యాయులు వినయ్, ఫిజికల్ డైరెక్టర్ మహేంద్ర వడ్డె రూపకు సర్టిఫికెట్ ను బహుకరించారు. అలాగే ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.