పెద్దకడబూరు మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
పెద్దకడబూరు మండల నాయకులు సుధాకర్, సందీప్ పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆదేశాలతో పెద్దకడబూరు మండల కేంద్రంలో 1వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కేవలం రూ.100 తో సభ్యత్వంతో రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించేలా టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు టీడీపీ సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.