నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ సూచనల మేరకు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు, ఎస్సై జఫ్రుల మరియు సిబ్బందితో కలిసి శనివారం మండల పరిధిలో దామగట్ల గ్రామంలో ఆకస్మిక దాడులు శనివారం చేశారు. ఈ దాడుల్లో నాటుసారా అమ్ముతున్న, బోయ దుర్గేష్ (49) వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలియజేశారు. నాటుసారా తయారీ విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.