నంద్యాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా సైబర్ క్రైమ్ టీం 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ నేరాల , నియంత్రణలో భాగంగా వరల్డ్ విజన్ ఇండియా, నంద్యాల ప్రాంతీయ అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాలలో 100 మంది పిల్లలతో గొడుగులు పట్టించి 1930 నెంబర్ పై అవగాహన కల్పించారు.