నంద్యాల జిల్లాలో ఈనెల 26వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.