నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన సందర్బంగా నంద్యాల ఎంపీ ఇంట్లో శనివారం జన్మదిన వేడుకలను అభిమానులు కేక్ కట్ చేశారు. శబరి ఇంటి ఆవరణలో టీ బి రోగులకు నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్. వెంకటరమణ, టీ బి వ్యాధి జిల్లా ఆఫీసర్ డాక్టర్ వినయ్ లు కందిపప్పు, వేరుశెనగ పప్పు, బెల్లం, రాగిపిండి, ప్రీడమ్ ఆయిల్ తదితర పౌష్టిక ఆహార కిట్లు టీ బి రోగులకు అందించారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.