నంద్యాల జిల్లా మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికని లేదా వెదురు కర్రల సేకరణకని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.