నంద్యాల జిల్లా అల్లినగరం గ్రామానికి చెందిన కాశయ్య అనే వ్యక్తి కి విద్యుత్ షాక్ తగిలి గాయాలు అయినట్లు స్థానికులు గురువారం తెలిపారు. బుక్కాపురానికి సమీపంలో ఉన్న పంట పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.