రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోలోలూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.